T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది.నిన్న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు.జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని కేవలం 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు.170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, జింబాబ్వే బౌలర్ల ధాటికి 146 పరుగులకే ఆలౌట్ అయింది.

2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. మళ్లీ 19 ఏళ్ల తర్వాత అదే తరహా విజయాన్ని నమోదు చేయడం విశేషం. టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో ఆస్ట్రేలియాపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఏకైక జట్టుగా జింబాబ్వే 100% విన్ రికార్డును కొనసాగిస్తోంది. గతంలో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను వరల్డ్ కప్‌లో (1983 మరియు 2007) ఓడించిన ప్రతిసారీ భారతదేశం ఆ వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఈ సెంటిమెంట్ ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.ప్రస్తుతం ఈ విజయంతో జింబాబ్వే గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది.

Tags: