Revenue Minister Ponguleti Srinivasa Reddy: వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Update: 2026-05-23 10:31 GMT

Revenue Minister Ponguleti Srinivasa Reddy: రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. వచ్చే మూడు రోజులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసరం కాకుండా ఎండలోకి బయటకు రాకూడదని స్పష్టం చేశారు.

ఎండలు, వడగాలుల పరిస్థితులపై మంత్రి పొంగులేటి నేడు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా ప్రదేశాల్లో మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సులభంగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

పరిహారం ప్రకటన: వడదెబ్బ (సన్‌స్ట్రోక్) కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ప్రజలు ఎండలో ఎక్కువసేపు బయట ఉండకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News