Bandi Sanjay: కుమారుడిపై పోక్సో కేసు: స్పందించిన బండి సంజయ్‌

స్పందించిన బండి సంజయ్‌

Update: 2026-05-12 16:07 GMT

Bandi Sanjay: తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును రాజకీయ కుట్రగా అభివర్ణించారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. ఇది తప్పుడు ప్రచారం మాత్రమేనని, నేరస్థుడిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సంజయ్‌ సూచించారు. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయన స్పందించారు.

“నా కుమారుడు ఏ తప్పు చేయలేదని చెబుతున్నాడు. నేను అతడిని సమర్థించడం లేదు. చట్టాన్ని, న్యాయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాం. చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో తీసుకోవచ్చు” అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

అయితే, కుమారుడిపై జరుగుతున్న దాడులు చూసి తన కన్నపేగు తల్లడిల్లుతోందని, డిప్రెషన్‌లోకి వెళ్తోందని ఆయన వ్యక్తం చేశారు. “నేను బాధపడుతున్నానని ప్రత్యర్థులు అనుకుంటున్నారు. కానీ నేనెప్పుడూ బాధపడను. కుట్రలు, కుతంత్రాలు చేసిన వారిని, నా కుటుంబాన్ని, నా పార్టీని ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదలను” అని బండి సంజయ్‌ హెచ్చరించారు.

ఈ కేసు సంబంధించి ఇటీవల బండి భగీరథ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. భగీరథ్‌ హైకోర్టును కూడా ఆశ్రయించారు.

Tags:    

Similar News