Bharat Rashtra Samithi (BRS): బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేతల నియామకం

శాసనసభాపక్ష ఉపనేతల నియామకం

Update: 2025-12-30 13:56 GMT

Bharat Rashtra Samithi (BRS): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శాసనసభాపక్ష ఉపనేతలను నియమించినట్లు పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు) మాజీ మంత్రులు టీ. హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను నియమించారు.

అలాగే శాసన మండలిలో పార్టీ ఉపనేతలుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, విప్‌గా దేశపతి శ్రీనివాస్‌లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియమించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నియామకాలతో పార్టీ శాసనసభ్యులు మరింత చురుగ్గా పనిచేసి, ప్రతిపక్ష బాధ్యతలను నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News