CM Revanth Reddy: కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీలు
సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీలు
తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అందజేత.. విద్యా, ఆర్థిక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో భేటీ అయ్యారు.
ముందుగా నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను అందజేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ ఖర్చును ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) పరిధి నుంచి మినహాయించాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రతిపాదనలు (డీపీఆర్) పంపించాలని కేంద్ర మంత్రి సూచించారు. వాటిని పరిశీలించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌లో ఐఐఎం (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ కోసం 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణకు 9 కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణ అభివృద్ధి, విద్యారంగ బలోపేతంపై ఈ భేటీలు కీలకంగా మారాయి.