CM Revanth Reddy: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: ప్రతి వార్డు, ప్రతి డివిజన్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్- సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

Update: 2026-01-31 09:23 GMT

CM Revanth Reddy: తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ సమావేశం ఏర్పాటు చేసింది. అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ ద్వారా ఈ మీటింగ్‌లో పాల్గొని, పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు తదితరులు హాజరయ్యారు. నామినేషన్లు ముగిసిన నేపథ్యంలో, ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించాలి. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. భాజపా, బీఆర్‌ఎస్ అభ్యర్థులతో సమానంగా మన కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా ఉండాలి. ప్రతి డివిజన్, ప్రతి వార్డులో విజయం సాధించడమే మన లక్ష్యం. రెబల్ నేతలతో చర్చలు జరిపి, సమన్వయం సాధించాలి. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాల్టీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, మంత్రుల మధ్య ఎలాంటి అంతరాలు లేకుండా చూసుకోవాలి" అని సూచించారు. ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News