Bathukamma Kunta: సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం

Update: 2025-09-28 08:00 GMT

Bathukamma Kunta: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈ రోజు (ఆదివారం) అంబర్‌పేట్‌లో పర్యటించనున్నారు. బతుకమ్మ కుంట (Bathukamma Kunta) ప్రారంభోత్సవం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గత రెండు రోజుల క్రితం భారీ వర్షం కారణంగా ఈ ప్రారంభోత్సవం వాయిదా పడింది.

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నారు. హైడ్రా సంస్థ ఐదు ఎకరాల 15 గుంటల స్థలంలో ఉన్న ఈ కుంటను పునరుజ్జీవం చేసింది. రూ.7 కోట్ల 40 లక్షలతో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలిపింది. బతుకమ్మ కుంటలో చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, చుట్టూ వాక్‌వేలను ఏర్పాటు చేశారు.

భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు

ఇదే రోజు, సీఎం రేవంత్‌రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొననున్నారు. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో FCDA భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా, రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.

Tags:    

Similar News