CM Revanth Reddy Slams KCR Era: కేసీఆర్ హయాంలో ప్రతిపక్షాలు మాట్లాడటానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. సెక్రటేరియట్‌కు వెళ్తే ఎంపీలను కూడా తాళ్లతో కట్టేశారు- సీఎం రేవంత్‌ రెడ్డి

సెక్రటేరియట్‌కు వెళ్తే ఎంపీలను కూడా తాళ్లతో కట్టేశారు- సీఎం రేవంత్‌ రెడ్డి

Update: 2025-12-04 12:36 GMT

CM Revanth Reddy Slams KCR Era: ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలతో కలిసి ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ వంటి నాయకులకు వారి సమస్యలు లేవనెత్తడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని.. కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతిపక్ష నాయకులకు ఎప్పుడూ మాట్లాడే అవకాశం ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో సెక్రటేరియట్‌కు వెళ్తానని చెప్పగానే, ఎంపీ అయినప్పటికీ నన్ను తాళ్లతో కట్టేశారని గుర్తు చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు.

ప్రజల ఆశీస్సులతోనే కాంగ్రెస్ ప్రజా పాలన కొనసాగుతోందని, ఒక వైపు అభివృద్ధి పనులు.. మరో వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా అలసిపోకుండా పని చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం (డిసెంబర్ 4) ఆదిలాబాద్ జిల్లా పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తర్వాత, ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని జనాలతో మాట్లాడారు.

ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చేస్తున్నామని, ఒకేసారి ఏడాదిలోగా పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా తన మొదటి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే జరిగిందని, మొదటి బహిరంగ సభ కూడా ఇంద్రవెళ్లిలోనే నిర్వహించామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రవెళ్లి అమరవీరుల స్మారక స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, అమరవీరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి ఆదుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను సవాలుగా తీసుకుని దత్తత తీసుకున్నానని, త్వరలోనే మరోసారి జిల్లాను సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News