CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆమెను తొలగించాలని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాకు సిఫార్సు లేఖ పంపారు. తక్షణమే సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం కోరారు.

సురేఖ రాజీనామా చేస్తారా.. లేక బర్తరఫ్ అవుతారా అనే ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. రాజీనామాకు ఆమె అంగీకరించకపోవడంతోనే సీఎం ఈ చర్యకు పూనుకున్నట్లు సమాచారం. గవర్నర్ లేఖపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో క్యాబినెట్ నుంచి సురేఖ తొలగింపు ఖాయమైంది.

ఇదే సమయంలో చిన్నారెడ్డిపైనా ప్రభుత్వం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించి, ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో ఏఐసీసీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరిచే వారి పట్ల కఠినంగా ఉండాలని, పార్టీపై గౌరవం లేనివారు వెళ్లిపోవాలని కార్యకర్తలు చెబుతున్నారు.

Tags: