Deputy CM Bhatti Vikramarka: విద్యుత్, నీటిని పొదుపుగా వాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు
భట్టి విక్రమార్క పిలుపు
By : PolitEnt Media
Update: 2026-10-17 12:58 GMT
Deputy CM Bhatti Vikramarka: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ అవార్డుల వేడుకలో ఆయన పాల్గొని పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో తీవ్రమైన చలి ఉండేదని, ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారిపోయిందని గుర్తు చేశారు. చలి నుంచి రక్షించుకునే రోజులు ముగిసి, ఇప్పుడు వేడి నుంచి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు చేరుకుందని ఆయన తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతుందని, అందువల్ల ప్రజలు నీరు, విద్యుత్‌ను అవసరానికి మించి వృధా చేయకుండా పొదుపుగా వాడాలని సూచించారు.