Minister Ponguleti: బీఆర్‌ఎస్‌ గూండాగిరీకి ప్రభుత్వం భయపడదు: మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటి

Update: 2026-07-02 11:41 GMT

Minister Ponguleti: బీఆర్‌ఎస్‌ పార్టీ గూండాగిరీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ మాత్రం భయపడదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అవినీతిని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బయటపెట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమలో బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వం పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ‘‘బీఆర్‌ఎస్‌ తమ తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద మోపే ప్రయత్నం చేస్తోంది. టెండర్‌ విలువ కంటే ఎక్కువ అవినీతి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రవర్తన కొనసాగిస్తే బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు’’ అని హెచ్చరించారు.

బీఆర్‌ఎస్‌ సవాల్‌ను స్వీకరించి మంత్రులు చర్చలకు వెళ్లగా, ఆ పార్టీ నేతలే రాకుండా పారిపోయారని, అసెంబ్లీలో కూడా ఈ అంశంపై చర్చకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని పొంగులేటి తెలిపారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

Tags:    

Similar News