M. Kodandaram and Mohammad Azharuddin as MLCs: తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. మాజీ క్రికెటర్‌, ప్రస్తుత మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌, తెలంగాణ ఉద్యమ ప్రముఖ నేత ప్రొఫెసర్‌ కోదండరాం పేర్లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆమోదం తెలిపారు.

రాష్ట్ర మంత్రివర్గం గత ఏడాది ఆగస్టులో ఈ ఇద్దరి పేర్లను గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అయితే పలు న్యాయపరమైన కారణాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఫైల్‌ పెండింగ్‌లో నిలిచింది. తాజాగా న్యాయ సలహా తీసుకున్న తర్వాత గవర్నర్‌ ఈ నియామకాలకు ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ నిర్ణయంతో అజారుద్దీన్‌ మంత్రిగా కొనసాగేందుకు అవసరమైన చట్టసభ సభ్యత్వ అడ్డంకి తొలగినట్లైంది. అలాగే కోదండరాం కూడా మళ్లీ శాసన మండలిలో ప్రవేశించనున్నారు.

ఇప్పటికే ఈ నియామకాలపై రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఈ గవర్నర్‌ ఆమోదం ముగింపు పలికినట్లైంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత అధికారిక ప్రక్రియ పూర్తవుతుంది.

Tags: