Bandi Sanjay: విచారణకు సహకరించడానికి కుమారుడిని పోలీసులకు అప్పగించా: బండి సంజయ్‌

బండి సంజయ్‌

Update: 2026-05-20 11:50 GMT

Bandi Sanjay: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన, అంకితభావం కలిగిన కార్యకర్తలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పేక్షించారు. కమిట్‌మెంట్‌తో పని చేసే బీజేపీ కార్యకర్త చివరి కోరిక ఏమిటని అడిగితే.. చనిపోయిన తర్వాత భాజపా జెండా కప్పాలని కోరుకుంటాడని చెప్పారు. తాను ఎలాంటి వ్యక్తో కార్యకర్తలందరికీ తెలుసని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని విపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా సంజయ్ స్పందించారు. ‘‘కేసీఆర్ పార్టీకి లోక్‌సభలో ఒక్క ఎంపీ కూడా లేడు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని ఏదో చెప్పుకుంటున్నారు. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చి, కుటుంబ పాలనను అంతం చేసింది మేమే. అందుకే మా పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

‘కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన తండ్రి నేనే’

‘‘కన్న కొడుకును పోలీసులకు స్వయంగా అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా? విచారణకు సహకరించాలనే ఉద్దేశ్యంతో నా కుమారుడిని నేనే పోలీసులకు అప్పగించాను’’ అని బండి సంజయ్ గర్వంగా తెలిపారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

Tags:    

Similar News