NRamachandrarao : ఓట్ చోరీ కాదు రాహుల్ గాంధీ బ్రైన్ చోరీ జరిగింది
టీపీసీసీ చీఫ్ మహష్‌గౌడ్‌కి కౌంటర్ ఇచ్చిన టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు;
ఏ ఓటర్ల జాబితాతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వచ్చిందో అదే ఓటరు జాబితాతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలుచుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. బీజేపీ ఎంపీలు ఓట్ల చోరీతో గెలిచారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఎన్.రామచంద్రరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రామచంద్రరావు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ అన్నట్లుగా అది ఓట్ల చోరీ కాదని, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ జరిగిందని రామచంద్రరావు మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు ఓట్ చోరీతో గెలిస్తే, అదే ఓటర్ల జాబితాతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఒప్పుకుంటారా అని రామచంద్రరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారని రామచంద్రరావు ఆరోపించారు. యూరియా సమస్యపై రైతులను రెచ్చగొట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. ముస్లీం రిజర్వేషన్లు పెంచి బీసీల రిజర్వేషన్లు తగ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. ఓటమి భయంలతోనే ఏదో ఒక సాకు చూపించి స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేస్తోందని రామచంద్రరావు విమర్శించారు.