Kavitha’s Warning: కవిత హెచ్చరిక: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే భారాసను దేవుడు కూడా కాపాడలేడు.. రేవంత్ వ్యాఖ్యలు అనుచితం

రేవంత్ వ్యాఖ్యలు అనుచితం

Update: 2026-01-03 12:49 GMT

Kavitha’s Warning: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై, జలవివాదాలపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆయన రాకపోతే భారత రాష్ట్ర సమితి (భారాస) పార్టీని దేవుడు కూడా కాపాడలేడని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కవిత.. ఉద్యమ నాయకుడిని ఉగ్రవాది కసబ్‌తో పోల్చడం తగదని మండిపడ్డారు.

శుక్రవారం శాసనమండలి మీడియా పాయింట్‌లో మీడియాతో మాట్లాడిన కవిత.. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సమస్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కారణమని ఆరోపించారు. ‘బబుల్ షూటర్’ను నమ్మడం వల్లే పార్టీకి ఇబ్బందులు తలెత్తాయని, ఆయన వల్లే ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని విమర్శించారు. అంతకుముందు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

కవిత మాటల్లోనే: ‘‘సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉరి తీయాలని మాట్లాడటం తగదు. తెలంగాణ ఉద్యమ నాయకుడిని కసబ్ వంటి టెర్రరిస్ట్‌తో పోల్చడం అస్సలు సరికాదు. కేసీఆర్ పోరాటంతోనే ఈ రాష్ట్రం ఏర్పడింది. జూరాల నుంచి శ్రీశైలం వరకు ఇంటేక్ పాయింట్ ఎందుకు మార్చారో ఆయనకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. తప్పు చేయనిదే ఎందుకు రాకూడదు? 5 లేదా 6వ తేదీన సభలో మాట్లాడి నా రాజీనామాకు కారణాలు వివరిస్తాను’’ అని కవిత స్పష్టం చేశారు.

కవిత వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. భారాస నేతలు, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News