Mahesh Kumar Goud : బీఆర్‌ఎస్ పాలనలో గ్లోబరీనా సంస్థ వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్లోబరీనా సంస్థ కారణంగా 28 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

“గ్లోబరీనా సంస్థ రిపోర్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదు? దీని వెనుక కేటీఆర్ హస్తం ఉందా?” అని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ అయిన నెలన్నర తర్వాత కేటీఆర్ నిద్రలేచి ప్రతిపాదనలు చేస్తున్నారని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని, ఇప్పుడు నీట్ లీక్ వ్యవహారంపై రాజకీయం చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గ్లోబరీనా సంస్థ వివక్షతను బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాచిపెట్టిందని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించిన మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ నేతల ధోరణిని తీవ్రంగా విమర్శించారు.

Tags: