Tramadol : పాకిస్తాన్ కు ఎగుమతి చేస్తున్న ట్రమడాల్ డ్రగ్ ను అడ్డుకున్న ఎన్సీబీ అధికారులు

సంగారెడ్డి ఫార్మా కంపెనీ డైరెక్టర్ ని అరెస్ట్ చేసిన ఎన్సీబీ

Update: 2025-08-12 05:48 GMT

పాకిస్థాన్ కు అక్రమంగా ఎగుమతి చేస్తున్న ట్రమడాల్ డ్రగ్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అడ్డుకున్నారు. పాక్ కు డ్రగ్ ఎక్స్ పోర్ట్ చేస్తున్న ఫార్మా కంపెనీ డైరెక్టర్ తోపాటు మరి కొంతమందిని ఈకేసులో అరెస్టు చేశారు. అనుమతి లేకుండా వీటిని ఎగుమతి చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. నొప్పి నివారణకు సంబంధించి ఈ డ్రగ్స్ ను ఉపయోగిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని ల్యూసెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ట్రమడాల్ డ్రగ్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు ఎన్సీబీ అధికారులకు సమాచారం అందడంతో రైడ్ చేయగా అక్కడ నుంచి పాకిస్తాన్‌కు అక్రమంగా డ్రగ్ ను తరలిస్తున్నట్టు తెలిసింది. కిందటి సంవత్సరం 25 వేల కిలోల డ్రగ్ ను ల్యూసెంట్ కంపెనీ ఎగుమతి చేసినట్లుగా గుర్తించినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు

హైదరాబాద్‌ నుంచి అక్రమంగా పాక్ కు డ్రగ్స్ ఎగుమతి అవుతున్నట్టు బెంగళూరు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారం సెర్చ్ చేశారు. ఎక్స్ పోర్ట్ చేస్తున్నటు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు తనిఖీలు చేయగా వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో ల్యూసెంట్ ఫార్మాపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ కంపెనీకి డెన్మార్క్, జర్మనీ, మలేసియా దేశాలకు మాత్రమే ఎగుమతి చేసే అనుమతి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఇన్వాయిస్ లు కూడా లభించాయి. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ల్యూసెంట్ డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ అక్రమ రవాణా గుట్టు జరుగుతోంది. 2021 సంవత్సరంలో 25 వేల కిలోల ట్రమడాల్ డ్రగ్ ను ఎగుమతి చేసినట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ఏమిటీ ట్రమడాల్ డ్రగ్..?

ట్రమడాల్ డ్రగ్ అనేది.. నొప్పిని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఇది నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థపై పని చేస్తుంది. అయితే ఎవరు పడితే.. వారు ఇష్టం వచ్చినట్టు దీనిని ఉపయోగించ కూడదు. ఎక్కువ మోతాదులో వాడిన ప్రమాదమే. ఇది ఓపియాడ్ మాదిరిగా నొప్పిని తగ్గిస్తుంది. పెద్దవారిలో నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు దీనిని వాడుతుంటారు. ఈ డ్రగ్ తీసుకునే మోతాదు ఎక్కువైతే.. మూర్ఛ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మద్యం, మత్తుమందులు, ట్రాంక్విలైజర్లు లాంటివి ఉపయోగించేవారు.. ట్రమడాల్ ను తీసుకోవద్దు. శ్వాస సమస్యలు, పేగు సంబంధింత వ్యాధి ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. ఒకవేళ అత్యుత్సాహంతో తీసుకుంటే.. శ్వాసపై ప్రభావం ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఉపయోగించినా.. మరణం సంభవించవచ్చు. వైద్యుల సూచన మేరకే.. దీనిని వాడాలి.

Tags:    

Similar News