CM Revanth Reddy: నెల రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి

Update: 2026-06-01 14:38 GMT

CM Revanth Reddy: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి సంకేతంగా పైలాన్‌ను ఆవిష్కరించారు.

స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన అందరూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికతను ప్రవేశపెడతామని ప్రకటించారు.

మహిళల సాధికారతకు ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ పథకం ద్వారా పేదలందరికీ సొంత ఇల్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News