ఐఅండ్‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా ప్రియాంక - పలువురి శుభాకాంక్షలు

Update: 2025-06-16 07:14 GMT

తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్‌గా సీ.హెచ్.ప్రియాంక బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో డిప్యూటీ సెక్రెటరీగా పనిచేస్తోన్న ప్రియాంక చెక్కను సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమీషనర్‌గా నియమించారు. దీంతో, ఇవాళ ఉదయం మాసబ్‌ ట్యాంక్‌లోని ఐ అండ్‌ పీ ఆర్‌ కార్యాలయంలో స్పెషల్‌ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఐ అండ్‌ పీఆర్‌ విభాగం అధికారులతో పాటు.. పలువురు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రియాంక చెక్క 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వరంగల్‌ ఎన్‌ఐటీ నుంచి బీటెక్‌ పట్టా పొందారు. ఆమె ఐఏఎస్ అధికారిణిగా ఎంపిక కాక ముందు.. న్యూయార్క్‌లో గోల్డ్‌మన్ సాచ్స్‌లో ప్రోగ్రామింగ్ అనలిస్ట్‌గా కూడా పనిచేశారు. గతంలో పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు.


Tags:    

Similar News