Revanth Government: ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లింపు.. రేవంత్ సర్కార్ శుభవార్త

రేవంత్ సర్కార్ శుభవార్త

Update: 2026-07-30 15:11 GMT

Revanth Government: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు గత 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలను చెల్లించిన ప్రభుత్వం, గురువారం మరో రూ.2,000 కోట్లను విడుదల చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం మూడు విడతల్లో ఒక్కోసారి రూ.2,000 కోట్ల చొప్పున మొత్తం రూ.6,000 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. దీంతో పెండింగ్‌లో ఉన్న విశ్రాంత ఉద్యోగుల కమ్యూటేషన్ బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న ఇతర బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News