Kavitha Levels Sharp Allegations: రేవంత్ సర్కార్ ప్రభుత్వ భూములను పెద్దలకు అప్పగిస్తోంది: కవిత

కవిత

Update: 2026-06-06 12:44 GMT

Kavitha Levels Sharp Allegations: రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాల్లో ఉన్నారని ఆమె ఆరోపించారు.

ప్రభుత్వ భూములను కాపాడేందుకు అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్తామని కవిత స్పష్టం చేశారు. హైద్రా వెళ్లి పేదల కాలనీలపై దాడులు చేసి భూములను పెద్దలకు అప్పగిస్తున్నారని విమర్శించారు.

“అప్పుడు కేటీఆర్ పాలన నడిచింది.. ఇప్పుడూ కేటీఆర్ పాలనే నడుస్తోంది” అని కవిత అన్నారు. అప్పుడు కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీశ్ రావు, రామారావులు అని, ఇప్పుడు కేటీఆర్ అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజల జాగీరేనని, పవన్ కల్యాణ్ జాగీర్ ఎంతమాత్రం కాదని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం తమ పార్టీ తీవ్రంగా పోరాడుతుందని ఆమె హెచ్చరించారు.

Tags:    

Similar News