Revenue Minister Ponguleti Srinivasa Reddy: రాష్ట్రంలో సవరించిన భూముల విలువలు శుక్రవారం నుంచి అమలు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతుల్లో భూముల విలువలు నిర్ణయం
Revenue Minister Ponguleti Srinivasa Reddy: రాష్ట్రంలో సవరించిన భూముల విలువలు జూన్ 5 (శుక్రవారం) నుంచి అమలులోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ మార్కెట్ ధరలతో హెచ్చుతగ్గులున్న వాటిని సరిచేయాలని మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త విలువలు అమలులోకి వస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
అభివృద్ధి స్థాయి ఆధారంగా హెచ్‌ఎండీఏ, క్యూర్ పరిధి మరియు రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లు నిర్ణయించారు. 2021 తర్వాత నిర్మాణ రేట్లను సవరించలేదని, గత ఐదేళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగినందున వాటిని సవరించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.
మున్సిపాలిటీలు నగరపాలికలుగా అప్‌గ్రేడ్ అయిన ప్రాంతాలు, విలీన గ్రామ పంచాయతీల్లో స్థానిక నిర్మాణాల కేటగిరీ ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా రేట్లను సవరించారు.
ప్రధానాంశాలు:
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా పారదర్శకంగా సవరణ చేశారు.
కొత్త ధరలు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, భూలావాదేవీల్లో పారదర్శకత పెంచడానికి, ప్రభుత్వ ఆదాయం పెంచడానికి దోహదపడతాయి.
సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక నిపుణులు అర్వింద్ సుబ్రమణ్యన్ నివేదిక, ఉన్నతాధికారుల సలహాలు, సమగ్ర అధ్యయనం ఆధారంగా శాస్త్రీయంగా విలువలు నిర్ణయించారు.
గత భారాస ప్రభుత్వం అశాస్త్రీయంగా ధరలు పెంచడం వల్ల సమస్యలు తలెత్తాయని, వాటిని సరిదిద్దేందుకు 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కమిటీలు నియమించి సవరణ చేశారు.
ఈ సవరణతో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.