Sanjay Jaju: తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం

నియామకం

Update: 2026-06-26 15:29 GMT

Sanjay Jaju: తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సంజయ్ జాజు (Sanjay Jaju) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమించారు. కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న సంజయ్ జాజును తెలంగాణకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి కొత్త సీఎస్ పోస్టుకు సంజయ్ జాజు, జయేశ్ రంజన్ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను పరిశీలించిన తర్వాత చివరికి సంజయ్ జాజు వైపు మొగ్గు చూపారు.

అనుభవం:

1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌గా వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు.

ఈ నియామకం తెలంగాణ పరిపాలనలో కొత్త మలుపును తెస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News