CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సోమవారం (సెప్టెంబర్ 28) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి దిల్లీకి బయలుదేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన దిల్లీలో పర్యటించనున్నారు.
28న ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం పాల్గొంటారు. 30న దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, సిరిసిల్లలో బహిరంగ సభకు హాజరవుతారు.
ఇదే సందర్భంగా మాజీ ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్‌సింగ్ గౌరవార్థం తెలంగాణలో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన విషయం తెలిపారు. కొత్తగూడెంలో ఏర్పాటైన ‘డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీ’ని 2025 డిసెంబరు 2న ప్రారంభించినట్లు సీఎం పేర్కొన్నారు. ఇది దేశంలోనే ఈ తరహాలో తొలి విశ్వవిద్యాలయమని ఆయన చెప్పారు. భూ శాస్త్రాలు, మైనింగ్, పర్యావరణ రంగాలకు సంబంధించిన అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు ఇక్కడ అందిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్‌లో మన్మోహన్‌సింగ్ విగ్రహావిష్కరణపై సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘ఎక్స్’లో హర్షం వ్యక్తం చేశారు. అయితే నిరాడంబర స్వభావం కలిగిన డాక్టర్ మన్మోహన్‌సింగ్ పేరిట ఆర్థిక శాస్త్రం, ప్రజా విధానాల్లో విశ్వవిద్యాలయం లేదా కళాశాల ఏర్పాటు చేస్తే మరింత బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై సీఎం ఆదివారం ‘ఎక్స్’లో స్పందిస్తూ, ఈ విశ్వవిద్యాలయం గురించి వివరించి, తదుపరి రాష్ట్రానికి వచ్చినప్పుడు సందర్శించాలని రాజ్‌దీప్‌ను ఆహ్వానించారు.