Telangana Eagle Force: గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి భారీ విజయం సాధించింది. దాదాపు 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది.

రాష్ట్రంలో అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుంచి లభించిన సమాచారం ఆధారంగా ఈగల్ ఫోర్స్ టీమ్ ఒడిశా వెళ్లింది. అక్కడ బలిమెల నుంచి జయపూర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర వెంబడించి గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అడ్డుకుంది.

పోలీసులు వెంబడించడంతో డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. వాహనంలో వివిధ ప్యాకెట్లలో ఉంచిన 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం ఒడిశాలోని గాంధీనగర్‌కు చెందిన అమీర్ అలీఖాన్ పేరుతో రిజిస్టర్ చేయబడినట్లు గుర్తించారు.

ఈ ఆపరేషన్ ద్వారా గంజాయి ముఠాలపై తెలంగాణ పోలీసులు చేపట్టిన కఠిన చర్యలు మరింత ఉక్కపోతంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ముఠా సభ్యులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

Tags: