Telangana Jagruthi President Kalvakuntla Kavitha: కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వేగం పెంచిన కవిత

వేగం పెంచిన కవిత

Update: 2026-01-20 06:41 GMT

Telangana Jagruthi President Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాల్లో వేగం పెంచారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాలు, వనరుల సద్వినియోగం వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేపట్టేందుకు గతంలోనే వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు.

సోమవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆ కమిటీల సభ్యులతో కవిత సమావేశమయ్యారు. సమావేశంలో అధ్యయన పురోగతి గురించి వివరాలు తెలియజేస్తూ, ప్రాథమిక నివేదికలను కమిటీ సభ్యులు సమర్పించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన బ్లూప్రింట్‌ రూపొందించే పనిలో జాగృతి నాయకులు నిమగ్నమై ఉన్నారు.

రెండు నుంచి మూడు నెలల్లో నూతన రాజకీయ ఏర్పాటుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని జాగృతి వర్గాలు తెలిపాయి.

ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ ప్రచారం

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కవిత సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ఆమె భేటీ అయినట్లు వర్తించుతోంది. పార్టీ ఏర్పాటు, ప్రజా సమస్యలపై పోరాటం, జనం కోణంలో పనిచేసే విధానం వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు ప్రచారం ఉంది. అయితే ఈ విషయాన్ని జాగృతి వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు.

Tags:    

Similar News