తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ఘనంగా ప్రారంభం: 154 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు

154 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు

Update: 2025-12-08 11:37 GMT

Telangana Rising Global Investors Summit Begins:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, లెగిస్లేచర్ సభల సభ్యులు, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, వివిధ దేశాలు, సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ సమిట్‌లో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతోంది. సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు ఇది కొనసాగనుంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సమిట్‌కు హాజరయ్యారు.

సమిట్ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికలో ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా ఈ సమిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. సుమారు 2 వేల మంది దేశీయ, విదేశీ అతిథులు హాజరవుతున్నందున అత్యాధునిక హాలులు, వసతి సౌకర్యాలతో పూర్తి ఏర్పాట్లు చేశారు.

సమిట్‌లో తెలంగాణలో ప్రజా పాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారాలు, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి అంశాలపై చర్చలు జరుగనున్నాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరంగా మాట్లాడనున్నారు. ఈ సమిట్ ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సమిట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో మరింత ఎదుగుదలకు చేర్చే మైలురాయిగా మారనుందని పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తన అభివృద్ధి మార్గదర్శకాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది.

Tags:    

Similar News