Minister Uttam Kumar Reddy: దేశంలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు తెలంగాణదే: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Update: 2026-05-29 10:58 GMT

Minister Uttam Kumar Reddy: తెలంగాణలో ధాన్యం సేకరణ సజావుగా సాగుతోందని, దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు క్షేత్రస్థాయిలో 13 వేల వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సేకరణ పనుల్లో సుమారు 2 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారని, సేకరణ కేంద్రాలకు 20.86 కోట్ల గన్నీ బ్యాగులు సరఫరా చేశామని వివరించారు.

ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.11,050 కోట్లు జమ చేశామని మంత్రి తెలిపారు.

“మద్దతు ధర కోసం రూ.49 వేల కోట్లు వెచ్చించాం”

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, “ధాన్యం సేకరణకు బిహార్‌, పశ్చిమబెంగాల్‌ కార్మికులపై ఆధారపడ్డాం. బెంగాల్‌లో ఎన్నికల కారణంగా కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లి రావడంలో ఆలస్యం అయింది. మా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి రూ.49 వేల కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం కేవలం రూ.10 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి” అని ఆరోపించారు.

“దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం మన తెలంగాణ. ఈ విషయాన్ని కేంద్రం కూడా ధృవీకరించింది. గతంలో బీఆర్‌ఎస్‌ పాలనలో కంటే ప్రస్తుతం ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర విధానాలను అనుసరిస్తూ, అదనంగా కొనుగోలు చేశాం. దీనికోసం రూ.16,479 కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత మా ప్రభుత్వది” అని స్పష్టం చేశారు.

ఈ ప్రెస్ మీట్‌లో మంత్రులు రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.

Tags:    

Similar News