Secret Revealed by CP Srinivas: ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్: గేమింగ్ యాప్స్‌తో 20 కోట్ల లాభం.. సీక్రెట్ బయటపెట్టిన సీపీ శ్రీనివాస్

సీక్రెట్ బయటపెట్టిన సీపీ శ్రీనివాస్

Update: 2025-11-25 12:41 GMT

Secret Revealed by CP Srinivas: ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవి బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ద్వారా 20 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు సీసీఎస్ అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఈ కేసుపై ఆయన ప్రెస్‌మీట్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, కీలక వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దర్యాప్తు వేగవంతమవుతున్నట్లు, మరిన్ని పైరసీ వెబ్‌సైట్లపై కరెక్షన్ తీసుకుంటున్నామని చెప్పారు.

ఐబొమ్మ రవి కేసు దర్యాప్తులో అధికారులు ముఖ్య సమాచారాలను సేకరిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం సీసీఎస్ అడిషినల్ సీపీ శ్రీనివాస్ ఐబొమ్మ రవి కేసును వివరించే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శించారు. మాట్లాడుతూ, రవికి బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ద్వారానే డబ్బులు వచ్చాయని, యాడ్ బుల్ కంపెనీ అతనిదేనని తెలిపారు. యాడ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ కంపెనీ ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడిచేశారు. ఇప్పటివరకు రవి 20 కోట్ల రూపాయలు సంపాదించినట్లు అంచనా వేస్తున్నారు.

ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన సీపీ శ్రీనివాస్, "ఐబొమ్మ, బప్పం వంటి సైట్‌లను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేశాడు. రవి ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే పట్టుబడ్డాడు. అతని భార్య మాకు ఎలాంటి సమాచారం అందలేదు. మరోవైపు, మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ వంటి పైరసీ వెబ్‌సైట్లు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాటి నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాం. ఐబొమ్మ పాపులర్ అయిన తర్వాత, దాని పేరుతో చాలామంది సైట్‌లు ప్రారంభించారు. సినిమా సమీక్షలకు కూడా ఐబొమ్మ పేరు వాడుకుంటున్నారు. భవిష్యత్తులో వెబ్-3 టెక్నాలజీతో పైరసీ చేస్తే, పట్టుకోవడం మరింత కష్టమవుతుంది" అని చెప్పారు.

కాగా, సోమవారం సాయంత్రం ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది. చివరి రోజు కస్టడీలో అధికారులు మూడు గంటల పాటు అతన్ని విచారించారు. అయితే, విచారణలో రవి నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని సమాచారం. ఈ కేసులో మరిన్ని విచారణలు జరుగనున్నాయి.

Tags:    

Similar News