Minister Konda Surekha: సాంకేతిక పరిజ్ఞానంతో దేవాలయాల పరిపాలనను బలోపేతం చేస్తాం: మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ

Update: 2026-07-21 11:48 GMT

Minister Konda Surekha: రాష్ట్ర దేవాదాయ శాఖలో సాంకేతిక ఆధారిత పాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. భక్తులకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు.

దేవాలయ పరిపాలన సమాచార నిర్వహణ వ్యవస్థ (టీఏఐఎంఎస్‌) అమలు మరియు యాదగిరి ట్రస్ట్‌ బోర్డు చట్టానికి సంబంధించిన ముసాయిదా నియమావళి అంశాలపై సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్‌ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవానీ శంకర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టీఏఐఎంఎస్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పరిపాలనను పూర్తి స్థాయిలో డిజిటలీకరించాలని, వివిధ మాడ్యూళ్లను రూపొందించడం, ఎదురవుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కారాలపై మంత్రి సురేఖ అధికారులకు సూచనలు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా భక్తులు సులభంగా సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వం ఈ సాంకేతిక వ్యవస్థలను దేవాదాయ శాఖలో పూర్తిస్థాయిలో అమలు చేసి, దేవాలయాల నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News