Us Tariffs : ఫెడరల్ కోర్టులో డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ
ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలు చట్ట విరుద్దమని తీర్పు ఇచ్చిన ఫెడరల్ కోర్ట్;
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి బిగ్‌షాక్ తగిలింది. ఇరుగుపొరుగు దేశాలపై తన ఇష్టారీతిని వేస్తున్న సుంకాలను అమెరికన్ ఫెడరల్ కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ట్రంప్ నోటికి వచ్చినట్లు విధిస్తున్న సుంకాలు చట్ట విరుద్దమని ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సుంకాల పెంపు విషయంలో ఫెడర్‌కోర్టు ఇచ్చిన తీర్పు ట్రంప్‌కి భారీ ఎదురు దెబ్బగా అమెరికాలోని ఆయన వ్యతిరేకులు అభివర్ణిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ రెండో దఫా అధికారంలోకి వచ్చాక ఐఈఈపీఏ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం అమలులోకి వచ్చాక ట్రంప్ అమెరికాతో వాణిజ్య భాగస్వామ్యం ఉన్న దేశాలపై భారీ సుంకాలు విధించారు. భారత్, చైనాలతో పాటు అనేక దేశాలను టార్గెట్‌గా చేసుకుని భారీ సుంకాలను విధించారు. పెనాల్టీల పేరుతో సుంకాలను రెట్టింపు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రంప్ విధిస్తున్న సుంకాలు చాలా వరకూ చట్ట విరుద్దమని కీలక వ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడిగా ట్రంప్ తనకు ఉన్న ఆర్థిక అధికారాలను అతిక్రమించి భారీ టారిఫ్‌లు విధించాడని ఫెడరల్ కోర్టు వ్యాఖ్యానించింది. ట్రంప్ విధించిన భారీ సుంకాలు పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపించాయని ఫెడరల్ కోర్టు పేర్కొంది. ఈ విషయంపై 7-4 తేడాతో అప్పీళ్ళ కోర్టు న్యాయమూర్తులు అధిక సుంకాలకు విరుద్దంగా తీర్పు వెలువరించారు. అయితే ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నట్లు సమాచారం.
ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో స్పందిచారు. ఫెడరల్ కోర్టు తీర్పు అమెరికాకు ఎంతో నష్టం చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా విధించిన టారిఫ్‌లు అన్ని దేశాల్లో అమల్లో ఉన్నాయని, టారిఫ్‌లు కనుక తొలగిస్తే అది అమెరికా దేశ చరిత్రలోనే పెద్ద విపత్తు కింద పరిగణించాల్సి 10వస్తుందన్నారు. అమెరికా మరింత బలపడాలని ట్రంప్ ఆకాంక్షించారు. అమెరికాలో వాణిజ్య లోటు పూడ్చటానికి, విదేశీ వాణిజ్య అధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఈ సుంకాలు బాగా ఉపయోగపడతాయని ట్రాంప్ అభిప్రాయపడ్డారు.