Earthquake in Afghanistan : ఆఫ్ఘన్‌లో భారీ భూకంపం… 650 మంది మృతి
హిందూకుష్ ప్రాంతలో ఏర్పడిన భూకంప తీవ్రత 6.3గా గుర్తింపు
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించి దాదాపు 650కి పైగా మృత్యువాత పడగా వేలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి 6.3 తీవ్రతతలో ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం కారణంగా ఢిల్లీ ఎన్‌సీఆర్, జమ్మూకాశ్మీర్ ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ ధన, ప్రాణ నష్టం చేకూర్చింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి అధికారులు రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరం చేశారు. అయితే ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘన్ అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. 2023 అక్టోబర్ మాసంలో ఇదే తరహాలో ఆఫ్ఘన్ పశ్చిమ ప్రాంతంలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం అప్పట్లో వేలాది మంది ప్రాణాలను బలిగొంది. సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలోనే హిందూకుష్ ప్రారంతంలో అదే 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటికే 650 మంది మరణించారని ఆఫ్ఘన్ ప్రభుత్వం వెల్లడించింది. తొలుత ఆఫ్ఘన్‌లో భూకంపం సంభవించినట్లు, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. హిందూకుష్ ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంతో పది కిలో మీటర్ల లోతున ఈ భూకంపం సభవించినట్లు గుర్తించారు.