Minister Nara Lokesh: పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన లోకేశ్, తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. “పెట్టుబడులను రాబట్టడంలో చొరవ చూపుతున్న మిమ్మల్ని అభినందిస్తున్నా. ప్రతి మంత్రి తన రాష్ట్రాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. పెట్టుబడిదారులతో చర్చలు జరపడం, వారిలో నమ్మకం పెంపొందించడం చాలా ముఖ్యం” అని లోకేశ్ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రాలు చొరవ చూపడాన్ని ప్రోత్సహిస్తున్నారని లోకేశ్ గుర్తు చేశారు.

కీర్తన స్పందిస్తూ “తమిళనాడు ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవకాశాలు కల్పించడానికి చిత్తశుద్ధితో, వినయంతో, పట్టుదలతో కష్టపడి పని చేస్తూనే ఉంటా”నని తెలిపారు.

Tags: