Ayyanna Patrudu: దక్షిణాఫ్రికాలో ఫీనిక్స్ సెటిల్మెంట్ సందర్శన.. గాంధీ మునిమనవడితో అయ్యన్నపాత్రుడు భేటీ
అయ్యన్నపాత్రుడు భేటీ
By : PolitEnt Media
Update: 2026-09-15 10:31 GMT
Ayyanna Patrudu: దక్షిణాఫ్రికాలోని చరిత్రాత్మక ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం సందర్శించారు. సత్యాగ్రహం జన్మస్థాన సందర్శన ఒక పవిత్ర యాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు.
సర్వోదయ హౌస్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. సత్యాగ్రహం పుట్టిన పవిత్ర భూమిని సందర్శించడం ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
గాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో భేటీ అయ్యి భారత్-దక్షిణాఫ్రికా సాంస్కృతిక సంబంధాలపై చర్చించారు. రామ్ గోబిన్‌ను కలంకారీ శాలువాతో సత్కరించి, ఏటికొప్పాక హస్తకళాకృతిని బహూకరించారు. విలువల ఆధారిత విద్యను అందిస్తున్న కస్తూర్బా పాఠశాల యాజమాన్యాన్ని, గాంధీ కుటుంబ కృషిని స్పీకర్ కొనియాడారు.