CM Chandrababu Launches Sharp Attack: సమాజానికి ‘గొడ్డలి పార్టీ’ హానికరం: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు

Update: 2026-05-23 10:12 GMT

CM Chandrababu Launches Sharp Attack: సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని, ‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ప్రసంగించారు.

“రప్పారప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు చేస్తున్నారా? సీబీఐ దగ్గర తోక జాడిస్తే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని” హెచ్చరించారు. గొడ్డలి పార్టీపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటు లేదని సీఎం అన్నారు.

అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రోజుకొక నాటకం ఆడుతున్నారని, అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయని, దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వారికి సన్మానాలు చేస్తున్నారని ప్రశ్నించారు.

కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు వేసి, తల్లి-చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా వేధించారని, తల్లి-చెల్లికి న్యాయం చేయలేని వారు ప్రజలను ఏం చూస్తారని సీఎం మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని, తాను ప్రజల సేవకుడని, పెత్తందారు కాదని చెప్పారు. నిరంతరం పని చేసి పేదల రుణం తీర్చుకుంటానని, ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించింది ఎన్డీయే కూటమి ప్రభుత్వమేనని సీఎం చంద్రబాబు తెలిపారు.

సంజీవని పథకం విస్తరణ

రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఏఐ డాక్టర్ ఉంటాడని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

డబ్బు, హోదా, కార్లు ఎన్ని ఉన్నా అన్నింటికీ మించినది ఆరోగ్యమేనని గుర్తు చేశారు. సంజీవని పథకం కింద ఇంటి నుంచే 74 రకాల వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని వివరించారు.

Tags:    

Similar News