Minister Kondapalli: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఉత్తరాంధ్రకు గ్రోత్‌ ఇంజిన్‌గా మారనుంది: మంత్రి కొండపల్లి

మంత్రి కొండపల్లి

Update: 2026-07-25 11:12 GMT

Minister Kondapalli: భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రచార కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ‘భూమి నుంచి భవిష్యత్తు వరకు’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

విజయనగరం కోట వద్ద నుంచి విమానాశ్రయం వరకు భారీ వాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు గ్రోత్‌ ఇంజిన్‌గా మారనుందని అన్నారు. విమానాశ్రయం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లెడ్జ్‌వాల్‌పై సంతకాలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభానికి కౌంట్‌ డౌన్ చూపిస్తూ డిజిటల్‌ టైమర్‌ వాల్‌ను ఆవిష్కరించారు. సెల్ఫీ పాయింట్‌ వద్ద పాల్గొన్నవారు ఉత్సాహంగా ఫొటోలు తీసుకున్నారు.

జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, జేసి సేధు మాధవన్, ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవి, కిమిడి కళా వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News