CM Chandrababu: చంద్రబాబు: కొత్త లేబర్ కోడ్స్ ..భారత అభివృద్ధి దిశలో మైలురాయి
భారత అభివృద్ధి దిశలో మైలురాయి
CM Chandrababu: కొత్త లేబర్ కోడ్స్ భారత అభివృద్ధి దిశలో మైలురాయిగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణల తర్వాత ఇవి అత్యంత కీలక మార్పులుగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ పేర్కొన్నారు.
ఈ కోడ్స్‌తో ఉద్యోగుల భద్రత మరింత బలపడుతుందని, వేతనాలకు పూర్తి హామీ ఏర్పడుతుందని చంద్రబాబు తెలిపారు. కార్మికుల గౌరవం, హక్కులకు ప్రాధాన్యత లభిస్తుందని వివరించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేక రక్షణ అందుతుందని, మహిళలకు మరింత సమానత్వం కలుగుతుందని ఆయన ఆనందంగా చెప్పారు.
భారత కార్మిక విధానాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సమీపంగా తీసుకువచ్చే ఈ సంస్కరణ చరిత్రాత్మకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మార్పులకు అంగీకారం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన అభినందలు తెలిపారు. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.