Ram Mohan Naidu Announcement: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. మేలో ప్రారంభమంటూ రామ్మోహన్ నాయుడు ప్రకటన

మేలో ప్రారంభమంటూ రామ్మోహన్ నాయుడు ప్రకటన

Update: 2025-12-16 11:26 GMT

Ram Mohan Naidu Announcement: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యంత ఆకర్షణీయంగా నిర్మిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్టులో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జీఎంఆర్-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ముందుగా వచ్చే ఏడాది జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించాలని భావించామని, అయితే ఒక నెల ముందుగానే మేలోనే అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

ఎడ్యుసిటీ ఏర్పాటుతో అనేక విద్యాసంస్థలు, యూనివర్సిటీలు స్థాపించవచ్చని, ఏవియేషన్ రంగంలో నైపుణ్య శిక్షణ అందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు.

భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో విజయనగరం-విశాఖపట్నం సరిహద్దుల్లో దేశంలో మొదటి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని నిర్మించనుంది. గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు ఈ ప్రాజెక్టులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీన్ని జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యు సిటీ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.

Tags:    

Similar News