Delhi High Court Setback to Sakshi Media: హెరిటేజ్ ఫుడ్స్ సంస్థపై అసత్య, నిరాధార ఆరోపణలతో వార్తలు ప్రసారం చేసిన సాక్షి మీడియాకు దిల్లీ హైకోర్టు తీవ్ర ఎదురుదెబ్బ ఇచ్చింది. ఆ వార్తలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు బోలెబాబా డెయిరీతో సంబంధాలు ఉన్నాయంటూ సాక్షి మీడియా పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ అసత్య ప్రచారంపై హెరిటేజ్ యాజమాన్యం రూ.100 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసింది.

విచారణ సందర్భంగా న్యాయస్థానం సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసి, 24 గంటల్లోగా అన్ని ప్రసార లింక్‌లను, వార్తలను తొలగించాలని ఆదేశించింది. ఒకవేళ సాక్షి మీడియా ఆదేశాలను పాటించకపోతే, మెటా (ఫేస్‌బుక్), గూగుల్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు స్వయంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ నిర్ణయం సాక్షి మీడియా మీద ఒత్తిడి పెంచడంతో పాటు, మీడియా సంస్థలు వార్తలు ప్రచురించేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సంకేతం ఇస్తోంది. ఈ కేసు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Tags: