constituencies Delimitation : జనాభాలెక్కల తరువాతే నియోజకవర్గాల పునర్విభజన

పునర్విభజనపై పురుషోత్తమరెడ్డి వేసిన పిటీషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు;

Update: 2025-07-25 07:47 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో ఉన్న సెక్షన్‌ 26 ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న 175 అసెంబ్లీ స్ధానాలను 225 స్థానాలకు పెంచాలని కోరుతూ ప్రొఫెసర్‌ కే.పురుషోత్తమరెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే ప్రొఫెసర్‌ పురుషోత్తమరెడ్డి వేసిన పిటీషన్‌ పై విచారణ జరిపిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం దాఖలైన పిటీషన్లను జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌కోటీశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం తిరస్కరించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం 2026వ సంవత్సరంలో జనాభా లెక్కలు పూర్తయిన తరువాత మాత్రమే అసెంబ్లీ, పార్లమెంట్‌ స్ధానాలకు పునర్విభజన చేపట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో స్పష్టత ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌170(3) ప్రకారం 2026 సంవత్సరంలో జనాభా లెక్కలు ప్రచురితమై తరువాతే నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే జమ్మూ కాశ్మీర్‌ లో జరిగిన ప్రత్యేక డీలిమిటేషన్ను మాత్రం సుప్రీకోర్టు సమర్థించింది.

Tags:    

Similar News