EnforcementDirectorate: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుల్లో రోజువారీ విచారణ జరిపి వేగంగా తీర్పు చెప్పాలని ఈడీ కోరింది. జగన్‌తో పాటు అన్ని నిందితులను వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్‌లో పేర్కొంది.

సీబీఐ కోర్టులో తొమ్మిది ఈడీ ఛార్జీషీట్లు గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని ఈడీ తెలిపింది. సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదని పేర్కొంది. ఆర్థిక నేరాలను దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా పరిగణించాలని కూడా ఈడీ కోరింది.

ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. జగన్ కేసులు త్వరగా తేల్చాలని గతంలోనూ పిటిషన్లు దాఖలైనట్లు న్యాయస్థానం గుర్తించింది. హరిరామజోగయ్య తదితరుల పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్‌ను జత చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. అన్ని పిటిషన్లను కలిపి ఈ నెల 13వ తేదీన తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది.

Tags: