ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో భేటీ అనంతరం సినీ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.

Film Producers: తెలుగు చిత్ర పరిశ్రమలో హైదరాబాద్‌ కేంద్రంగా గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు వివరంగా తెలిపామని సినీ నిర్మాతలు తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరంలో ఉన్న ఉప ముఖ్యమంత్రిని నిర్మాతలు రవిశంకర్, కిలారు సతీష్, నాగవంశీ, సాహు గారపాటి కలిశారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాతలు, చర్చలు చాలా మంచి వాతావరణంలో జరిగాయని, పవన్‌ కల్యాణ్‌ ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాలను వివరంగా తెలుసుకున్నారని చెప్పారు. రెండు వర్గాలకూ న్యాయం జరిగేలా చక్కటి పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారని వెల్లడించారు.

పెద్ది సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఉందని తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆధునికీకరిస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని కూడా పేర్కొన్నారు.

Tags: