Aerospace : చంద్రబాబు విజనరీ లీడర్ షిప్ వల్లే రాష్ట్రానికి గ్లోబల్ పరిశ్రమల రాక

ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో మంత్రి నారా లోకేష్;

Update: 2025-08-30 04:05 GMT
  • శంషాబాద్ మాదిరిగానే భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందుతుంది
  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు సులభతరమైన విధానం
  • ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక... ఆ పరిశ్రమ పూర్తి బాధ్యత మాదే

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజనరీ లీడర్ షిప్ వల్లే ఆర్సెలర్స్ మిట్టల్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విడిభాగాల నుంచి పోటీతత్వం వరకు భారతదేశ ఏరో స్పేస్ తయారీ, ఎంఆర్ఓ (Maintenance, Repair, and Operations) రంగాలను వేగవంతం చేయడం అనే అంశంపై భారత విమానయాన మంత్రిత్వశాఖ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫాక్చరర్స్ సంయుక్త ఆధ్వర్యాన విశాఖ నోవా టెల్ హోటల్ జరిగిన సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో పరిశ్రమ ప్రముఖులు, గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (OEMs), ఎంఎస్ఎంఇలు, విద్యావేత్తలు, ఏరోస్పేస్, రక్షణరంగ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... చంద్రబాబు శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించినపుడు 5వేల ఎకరాలు ఎందుకని కొందరు విమర్శలుచేశారు, ఈరోజు తెలంగా రాష్ట్ర జిఎస్ డిపిలో 11శాతం ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్టు వల్లే ఆ రాష్ట్రానికి సమకూరుతోంది. ఇప్పుడు అదే విజనరీ నేతృత్వంలో మనకు భోగాపురం ఎయిర్ పోర్టు రాబోతోంది. దీనిద్వారా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. ప్రధాని మోడీజీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రస్తుతం ఎపిలో డబుల్ ఇంజన్ సర్కారు పనిచేస్తోంది, సుందరమైన విశాఖనగరంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టమ్ అందుబాటులో ఉంది. విజన్ -2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతిఏటా 15శాతం వృద్ధిరేటు సాధించాల్సి ఉంది. స్పష్టమైన విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మూడు ముఖ్యమైన అనుకూలతలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి విజనరీ లీడర్ షిప్, రెండోది అనుభవజ్జులైన యువ నాయకత్వం, మూడవది స్టార్టప్ రాష్ట్రం. చంద్రబాబుగారి విజన్, సమర్థ నాయకత్వంలో ఎపి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుంది. ఎపి ఏరోస్పేస్, డిఫెన్స్ సలహాదారుగా సతీష్ రెడ్డి లాంటి ప్రముఖులు కీలకమైన సలహాలు అందిస్తుండగా, సాయికాంత్ వర్మ లాంటి యువ ఐఎఎస్ అధికారులు పెట్టుబడులను పర్యవేక్షిస్తున్నారు. భారతదేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన రామ్మోహన్ నాయుడు లాంటి యువనాయకత్వం ఎపిలో ఉంది. అక్టోబర్ లో ఆర్సెలర్స్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఆసియాలోనే అతిపెద్దదైన గూగుల్ డాటా సెంటర్ కు రాబోతోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా అడుగులు వేస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును రెన్యూ సంస్థ రాయలసీమలో పనులు ప్రారంభించింది. మీరు ఆంధ్రప్రదేశ్ తో ఒప్పందం చేసుకున్నాక అది మీ ప్రాజెక్ట్ కాదు, పూర్తి బాధ్యత మాది. ఎపిలో పెట్టుబడులు పెట్టే ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు సులభతరమైన అనుమతుల కోసం విధానపరమైన మార్పులు తెచ్చామన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీజీ వికసిత్ భారత్, చంద్రబాబుగారి విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం $180 బిలియన్ డాలర్లు ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాటికి $2.4 ట్రిలియన్లకు చేర్చడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో విమానయాన, రక్షణరంగాల్లో పెట్టుబడులకు ఇద్దరు నాయుడులు (చంద్రబాబునాయుడు, రామ్మోహన్ నాయుడు) వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రపంచ ఓఇఎంలు, ఎంఎస్ఎంఇలు, స్టార్టప్ లు, విద్యావేత్తలు మాతో కలసి పనిచేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏరోస్పేస్ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నేలపై నిర్మితమవుతోంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టి, కొత్త ఆవిష్కరణలు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఎంఎస్ఎంఇ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సిఐఐ ఏపీ చైర్ పర్సన్ గన్నమని మురళీకృష్ణ, ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సిఇఓ సాయికాంత్ వర్మ, ఏపీ ఏరోస్పేస్ & డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి, జిఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ సిఇఓ కరణ్ బీర్ సింగ్ కల్రా, సిఐఐ డిప్యూటీ డైరెక్టర్ సోనాల్ బెనర్జీ, సయాంట్ ఫౌండర్ చైర్మన్ బివియర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News