Tirumala Venkateswara Temple Prasadam Adulteration Issue: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదిక అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ పని చేయనుంది. కమిటీలో డీజీపీ సభ్యులుగా, న్యాయశాఖ కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏకసభ్య కమిషన్ నివేదికలోని సిఫార్సులు, నిర్ణయాలను అధ్యయనం చేసి అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. న్యాయపరమైన చర్యలు, అమలు ప్రణాళిక, కాలపరిమితి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, వారం రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించింది.

ఈ కమిటీ ప్రసాదం కల్తీ నివారణ, నాణ్యత నియంత్రణ, సంబంధిత యంత్రాంగాలపై చర్యలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల అమలును సమర్థవంతంగా చేయడానికి సూచనలు చేయనుంది.

Tags: