Jogi Ramesh’s Family: వరకట్న, హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరి జోగి రమేశ్ కుటుంబం పిటిషన్
జోగి రమేశ్ కుటుంబం పిటిషన్
By : PolitEnt Media
Update: 2026-07-29 11:21 GMT
Jogi Ramesh’s Family: తమను అరెస్ట్ చేయొద్దంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేశ్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మహిళా కోర్టు, కౌంటరు దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేశ్ పెద్ద కోడలు జోగి మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
ఈ కేసులో నిందితులుగా జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము, సోదరి రమతో పాటు కుటుంబ సభ్యులు 11 మందిని చేర్చారు. జోగి రాజీవ్, రమేశ్, శకుంతల, రోహిత్, ప్రియాంక, జోగి రాము, అతని ఇద్దరు కుమారులు రాకేష్, పాండు, స్వామి, రమ, సాయి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.