Supreme Court : కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌

మధ్యంతర ఆదేశాలను తొలగించిన సర్వోన్నత న్యాయస్ధానం;

Update: 2025-08-14 09:41 GMT

సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సాక్షి టీవీ చర్చ కార్యక్రమం కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు గురువారం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను పర్మినెంట్‌ బెయిల్‌గా కన్ఫర్మ్‌ సుప్రీంకోర్టు కన్ఫర్మ్‌ చేసింది. తన టీవీ షోలో గెస్ట్‌లు ఏసే వరువునష్టం వ్యాఖ్యలను అనుమతించవద్దన్న మధ్యంతర ఆదేశాలను సర్వోన్నత న్యాయస్ధానం తొలగించింది. లైవ్‌లో గెస్ట్‌లు చేసే వ్యాఖ్యలను ఎలా కంట్రోల్‌ చేయగలమని కొమ్మినేని శ్రీనివాసరావు తరపు న్యాయవాది అభ్యర్ధన మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. అరెస్ట్‌ విషయంలో ఆర్నేష్‌కుమార్‌ జడ్జిమెంట్‌ తప్పనిసరిగా పాటించాలని ఏపీ పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో పోలీసులు ముందుగా 41ఏ నోటీసులు ఇచ్చి ప్రాథమిక విచారణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో ఏపీ పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా నేరుగా ఆరెస్ట్‌ చేసి విజయవాడ తీసుకువెళ్ళారు. ఈ విషయం కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని ఆర్నేష్‌ కుమార్‌ జడ్జిమెంట్‌ను ప్రస్తావించింది. కొమ్మినేని శ్రీనివాసరావు తరపున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్ధ దవే, అల్లంకి రమేష్‌లు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సర్వోత్తమ న్యాయస్ధానం కేసు విచారణను ముగించింది.

Tags:    

Similar News