AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం: రాజ్ కసిరెడ్డి అరెస్ట్

రాజ్ కసిరెడ్డి అరెస్ట్

Update: 2026-06-11 12:32 GMT

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.

మనీలాండరింగ్ మరియు హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తో సహా పది చోట్ల ఏకకాలంలో సోదాలు జరిగాయి. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాలు మరియు ఇతర అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు.

ఈ సోదాల్లో భాగంగా రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ మరియు మద్యం రవాణా కేసుల్లో అతన్ని వివరంగా విచారించనున్నట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ అవసరమని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే విజయవాడ సిట్ నాలుగు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఫైనల్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది

లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుతోంది. జగన్ అండ్ గ్యాంగ్ వేల కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. జే బ్రాండ్స్ విషంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుండటంతో, త్వరలో జగన్‌కు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News