Nara Lokesh Accuses: జగన్‌ మోహన్‌రెడ్డి రాక్షస చేష్టలు చేస్తున్నారు.. దేశ రక్షణ కంపెనీని తరిమేస్తానన్నారు: మంత్రి నారా లోకేశ్

దేశ రక్షణ కంపెనీని తరిమేస్తానన్నారు: మంత్రి నారా లోకేశ్

Update: 2026-04-16 11:52 GMT

Nara Lokesh Accuses: దేశ రక్షణకు అత్యాధునిక బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానని జగన్‌ మోహన్‌రెడ్డి అనడం ఏమిటని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. ఇదేం రాక్షస మనస్తత్వమని నిలదీశారు. మత్స్యకారుల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించాల్సింది పోయి అడ్డుకుంటాననడం ముమ్మాటికీ సైకోపత్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

తల్లిని తరిమేసి, చెల్లిని గెంటేసిన జగన్‌కు దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే ద్వేషం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగాలు వస్తున్నాయంటే దోపిడీ అని గగ్గోలు పెడుతున్నారు. నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసం నిండి ఉన్నాయి. అమరావతిని మార్చేస్తాం.. కట్టినవన్నీ కూల్చేసి, కంపెనీలన్నీ వెళ్లగొడతామంటున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి సర్‌.. ఇవేం రాక్షస చేష్టలు? అని లోకేశ్ తన ఆగ్రహాన్ని ఒక్క పోస్టులోనే ఉగ్గడించారు.

Tags:    

Similar News