Nara Lokesh: హామీ నిలబెట్టిన నారా లోకేశ్‌.. వడ్డెరల సాధికారతకు కొత్త దారి

వడ్డెరల సాధికారతకు కొత్త దారి

Update: 2026-06-23 15:36 GMT

 Nara Lokesh:వడ్డెర సమాజం ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు మరో ముఖ్యమైన హామీని నెరవేర్చారు. క్వారీల్లో వడ్డెరలకు 33 శాతం వాటా కేటాయించాలనే యువగళం పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 126 ద్వారా అమలు చేసింది.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, “యువగళం పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు తమ సాంప్రదాయిక వృత్తిని కొనసాగించడానికి క్వారీలు కేటాయించాలని నన్ను కోరారు. ఆ హామీని నెరవేర్చడం ద్వారా మా ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నిరూపించింది. మాటలు కాదు, చేతల్లో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీని వేగంగా అమలు చేస్తోందని, ఈ నిర్ణయం వడ్డెర సమాజం ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని లోకేశ్ అన్నారు. ఈ తాజా నిర్ణయంపై వడ్డెర సంఘాల నేతలు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కీలక నిర్ణయం రాష్ట్రంలోని వడ్డెర సమాజానికి కొత్త ఆశలు కలిగించింది.

Tags:    

Similar News