Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్: మన జీవితాన్నిచ్చే నదులను చంపవద్దు.. గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం
గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం
Deputy CM Pawan Kalyan: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గోదావరి నది రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.
"మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపవద్దు. గోదావరి, కృష్ణ నదులను రక్షించుకోవాలి" అని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఆరు నెలల్లో నదుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా గోదావరి పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి పనుల వివరాలు వివరించారు. అనంతరం పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణించి స్థలం మీదుగా పరిశీలించారు.
అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను మంత్రి కందుల దుర్గేశ్ పవన్‌కు వివరించారు. గోదావరి నదిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలపైనా పవన్ దృష్టి సారించారు.
సమీక్ష అనంతరం ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా నిడదవోలు నియోజకవర్గంలోని విజ్జేశ్వరానికి వెళ్లనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.